సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం
- April 14, 2024
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం రేగింది. ముంబయిలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి.. పలు రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపి.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. తక్షణమే రంగంలోకి దిగారు. కాల్పుల జరిపిన ఆగంతకుడ్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను మట్టుబెడతామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ, గోల్డీ బ్రార్‌లు గతంలో అనేక మార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2018లో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అయితే, అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సల్మాన్‌కు ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన ఇంటిముందు మూడు షిఫ్టుల్లో పహారా కాస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌కు ఆయుధ లైనెన్స్ కూడా మంజూరైంది. వ్యక్తిగత ఆయుధాన్ని నిత్యం వెంట తీసుకెళ్లేందుకు సల్మాన్‌కు పోలీసులు అనుమతించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అంతుకుమునుపు జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్ మాట్లాడుతూ తనకు, లారెన్స్ బిష్ణోయ్‌కు అవకాశం చిక్కితే సల్మాన్‌పై దాడి చేస్తామని పేర్కొన్నాడు. 2018లో విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ .. కోర్టు ఆవరణలోనే సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన ధాకడ్ రామ్ సిహాగ్ అనే దుండగుడిని రాజస్థాన్ పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉండటంతో భద్రతను కల్పించారు పోలీసులు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







