భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..
- April 17, 2024
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి మిథిలా మండపంలో సీతారాములవారి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కల్యాణంను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో భక్తులు ఇబ్బందిపడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలు, 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా భద్రాచల సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం