'ప్రతినిధి 2' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదుల

- April 17, 2024 , by Maagulf
\'ప్రతినిధి 2\' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదుల

హైదరాబాద్: 'ప్రతినిధి 2'తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు.

సురేంద్రనాథ్‌ బొల్లినేని, కుమార్‌ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట నిర్మించారు. సిరీ లెల్ల కథానాయిక. సప్తగిరి, జిషు సేన్‌ గుప్తా, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ''గల్లా ఎత్తి నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు.. కల్లాబొల్లి మాటలు జెప్పే కాకీ గోల ఎల్లాగొట్టు'' అంటూ సాగిన ఈ పాటకు మహతి స్వర సాగర్‌ బాణీలు సమకూర్చారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు.

రామ్‌ మిరియాల ఆలపించగా.. భాను మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు: మూర్తి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com