మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
- June 06, 2016
పండిన మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారా? అయితే మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మామిడి పళ్ల గుజ్జుతో పూతలని ఎలా వేసుకోవచ్చో చూడండి..
ఒ క చెంచా బాగా పండిన మామిడిపండు గుజ్జుని తీసుకుని, అందులో చెంచా ముల్తానీమట్టిని వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. అయితే పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. కాస్త తడి ఉండగానే మునివేళ్లతో రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది.
రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్మీల్ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనం.
చెంచా గులాబీనీళ్లూ, చెంచా పెరుగూ, చెంచా ముల్తానీమట్టికి.. రెండు చెంచాల మామిడిపండు గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం నిగారిస్తుంది.
రెండు చెంచాల పచ్చిపాలకి, చెంచా తేనెతోపాటూ పెద్దచెంచా మామిడిపండు గుజ్జుని కలిపి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







