దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- April 18, 2024
యూఏఈ: దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ దీపక్ మోహన్.. వరదల మధ్య చిక్కుకుపోయిన పర్యాటకులు మరియు నివాసితులను రక్షించడానికి తన ఆఫ్-రోడింగ్ నైపుణ్యాలను ఉపయోగించారు. తన 2000 మోడల్ ల్యాండ్‌క్రూయిజర్‌ను వరద నీటిలో నడుపుతూ, అతను చాలా మంది వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇందులో ఒక నిండు గర్భిణి నర్సు, ఆమె కుమార్తెతో పాటు వీల్‌చైర్‌లో ఉన్న మహిళ మోహన్ నిస్వార్థ పనులకు చాలా మంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మోహన్ రాత్రి 8:30 గంటల సమయంలో అల్ జద్దాఫ్‌లోని ఇంట్లో ఉన్నప్పుడు తన ఆఫ్-రోడింగ్ గ్రూప్‌లో సమాచారం అందించానని తెలిపారు. అలాగే దుబాయ్ మాల్‌లో చిక్కుకున్న కజకిస్తాన్ కుటుంబం గురించి వాట్సాప్ సందేశం వచ్చినప్పుడు రాత్రి 9:45 గంటల సమయంలో బిజినెస్ బేలోని ఎగ్జిక్యూటివ్ టవర్స్ నుండి తిరిగి వస్తున్నట్లు మోహన్ తెలిపారు. ఒక చిన్న కుమార్తెతో ఉన్న జంటను మంఖూల్‌లోని వారి హోటల్‌కు తీసుకువెళ్లినట్టు మోహన్ తెలిపారు. ఆ తర్వాత ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ వద్ద ఒక భారతీయ జంట అల్ సఫా స్ట్రీట్‌కు వెళ్లేందుకు క్యాబ్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న జంటను మీనా బజార్‌లోని ఆస్టోరియా హోటల్‌కి చేర్చినట్లు తెలిపారు. అల్ బార్షాలోని ఒక క్లినిక్‌లో నిండు గర్భిణి నర్సు మరియు మరో ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఇరుక్కున్నట్లు వాట్సాప్‌లో సందేశం రాగానే తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో అల్ ఖైల్‌లో వారిని సురక్షితంగా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వీల్‌చైర్‌లో ఉన్న మహిళ మరియు ఆమె కుమార్తె తనకు సహాయం చేసిన చివరి వ్యక్తులు అని మోహన్ చెప్పారు. "వారు ముందుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, టెర్మినల్ 3కి చేరుకున్నారు. రవాణా అందుబాటులో లేనందున బయలుదేరలేకపోయారు." కుమార్తె తులికా ప్రదీప్, మోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వాట్సాప్ సపోర్ట్ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. "ధన్యవాదాలు, మీరు ఒక దేవదూత. నేను నా సీనియర్ సిటిజన్ అమ్మతో విమానాశ్రయంలో చిక్కుకున్న క్లిష్ట పరిస్థితిలో మీరు మాకు సహాయం చేసారు. చాలా ధన్యవాదాలు మరియు దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు! మీరు అద్భుతమైన డ్రైవర్. అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?