ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- April 18, 2024
లక్నో: తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్‌పుర్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్య. వివిధ కేసుల్లో ఆయనకు శిక్షపడటంతో భార్యను బరిలో నిలిపారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గతంలో హుజూర్‌నగర్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి లలితారెడ్డి సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీల కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. శ్రీకళారెడ్డి పేరిట రూ.780 కోట్ల ఆస్తులున్నాయి. జౌన్‌పుర్ పరిధిలో శ్రీకళారెడ్డికి బలం, బలగం అన్నీ ఆమె భర్తే. శ్రీకళారెడ్డి భర్త పేరు ధనంజయ్ సింగ్. ఆయన మాజీ ఎంపీ. స్థానికంగా బాహుబలి నేతగా, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సన్నిహితుడిగా ధనంజయ్ సింగ్‌కు పేరుంది. కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు బ్యాన్ విధించింది. దీంతో జౌన్‌పుర్ లోక్‌సభ టికెట్‌ను ధనంజయ్ సింగ్ సతీమణి శ్రీకళారెడ్డికి మాయావతి కేటాయించారు. శ్రీకళారెడ్డి బాల్యం కూడా చెన్నైలోనే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా, బీకామ్ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







