ఒడిశాలోని జాజ్‌పూర్ కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్

- April 18, 2024 , by Maagulf
ఒడిశాలోని జాజ్‌పూర్ కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్

భువనేశ్వర్: జాజ్‌పూర్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నిఖిల్ పవన్ కళ్యాణ్‌ను ఒడిశా ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ & పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిఖిల్ పవన్ కళ్యాణ్ ఒడిశాలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా బదిలీకి ముందు కటక్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుత జాజ్‌పూర్ కలెక్టర్ శుభాంకర్ మహపాత్ర తన బావ ఢెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ముందు స్వచ్ఛందంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఆయనను మార్చాలని ఈసీ నిర్ణయించింది. కాగా నిఖిల్ పవన్ కళ్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నానికి చెందిన వారు కాగా, ఆయన తండ్రి మృత్యుంజయ రావు గుడ్లవల్లేటి హిందూ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com