‘మనమే’ టీజర్ టాక్.! ఇది శర్వా సినిమాయేనా.?
- April 19, 2024
శర్వానంద్ అంటే విలక్షణ నటనకు ప్రతిరూపం. అన్ని రకాల ఎమోషన్లు పండించగల నటుడు శర్వానంద్. ‘రన్ రాజా రన్’ సినిమాతో తనలోని హ్యూమరస్ యాంగిల్ సైతం బయటికి తీసి సక్సెస్ అయ్యాడు.
ఈ మధ్య శర్వానంద్ నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శర్వా నటించిన ‘మనమే’ చిత్రం టీజర్ రిలీజ్ కావడంతో, మళ్లీ శర్వానంద్ సినిమాల్లో యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక, ‘మనమే’ విషయానికి వస్తే.. లేటెస్ట్‌గా టీజర్ రిలీజ్ చేశారు. కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా నటిస్తోంది. ఓ తల్లి, తండ్రి, కొడుకు.. ఇలా ట్రయాంగిల్‌లో సాగే కథగా టీజర్‌ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఎటువంటి బాధ్యతా లేని తండ్రిగా, భర్తగా శర్వానంద్ పాత్రను పరిచయం చేశారు. ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటేనే ఉద్యోగం కూడా చేసే భార్యగా, ఓ బిడ్డకి తల్లిగా కృతి శెట్టి పాత్ర కనిపిస్తోంది.
క్యారెక్టర్లయితే ఇంట్రెస్టింగ్‌గానే వున్నాయ్. కానీ, టీజర్ ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అసలు శర్వానంద్ సినిమానే కాదిది అనే రెస్పాన్స్ కూడా వస్తోంది. అలాగే, శర్వానంద్ డైలాగులు కానీ, ఆటిట్యూడ్ కానీ ఏవీ ఫ్రేక్షకుల్ని మెప్పించడం లేదు టీజర్‌లో. చూడాలి మరి, లాంగ్ గ్యాప్ తర్వాత వ స్తున్న ‘మనమే’ శర్వాకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.!
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







