అనన్యా.! అసలు నీకేమైందమ్మా.!
- April 19, 2024
తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మంచి నటి. అవకాశాలు దక్కడం లేదు కానీ, సరైన అవకాశం దక్కితే, ప్రూవ్ చేసుకోగలిగే కెపాసిటీ వున్న ముద్దుగుమ్మ.
అయితే ఈ మధ్య ఏం జరిగిందో ఏమో కానీ, అనన్య నాగళ్ల చేస్తున్న సినిమాలు హిట్టూ, ఫట్టూ.. సంగతి పక్కన పెడితే, ఆమె యాక్టింగ్‌కే ఎసరు పెట్టేస్తున్నాయ్.
ముద్దుగా అందంగా కనిపించే అనన్య నాగళ్ల మొన్నా మధ్య ఏదో సర్జరీ చేయించుకుంది. ఆ కారణంగా ముఖ కవళికల్లో కాస్త డిఫరెన్స్ కనిపిస్తోంది. ఆమె ముఖంలో మునుపటి క్యూట్‌నెస్ పోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
క్యూట్‌నెస్‌తో పాటూ, పర్‌ఫామెన్స్ కూడా చెడిందంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయ్. ఎంతో చక్కటి అభినయంతో ఆకట్టుకునే అనన్య నాగళ్ల.. విచిత్రమైన హావభావాలతో చికాకు పుట్టిస్తోంది. యాక్టింగ్ మర్చిపోయిందా.? ఏంటీ.? అంటూ కొందరు నెటిజన్లు అనన్యను ఆడి పోసుకుంటున్నారు.
ఇటీవల ‘తంత్ర’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాలోనే అనన్యను భరించలేకపోయామంటే, తాజాగా ‘పొట్టేల్’ అనే సినిమాతో రాబోతోంది. ఈ సినిమాలోనూ అనన్యది అదే తీరు.! ఇలా అయితే ఎలాగమ్మా.! అవకాశాలు వస్తున్నాయ్‌గా.. అభినయం ఇంకాస్త బెటర్ చేసుకోవాలంటూ సూచనలూ సలహాలూ ఇస్తున్నారు అనన్య అభిమానులు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?