అవకాశాలు బాగానే వస్తున్నా.. అదృష్ట ‘నిధి’ దక్కడం లేదే.!
- April 19, 2024
నిధి అగర్వాల్.. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ. పాపం.! అన్నీ వున్నా అదేదో అన్నట్లు.. అందం, అభినయం, డాన్సింగ్ టాలెంట్.. ఇలా అన్ని కళలున్నప్పటికీ అసలు కళ అదృష్టమే వరించడం లేదీ ముద్దుగుమ్మకి.
‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో ఓ సూపర్ హిట్ కూడా ఖాతాలో వేసుకుంది. అయినా నిలబడలేదు. పవన్ కళ్యాణ్ రూపంలో (హరి హర వీరమల్లు) ఓ బిగ్గెస్ట్ ఆఫర్ కూడా చేజిక్కించుకుంది. అయినా లాభం లేకుండా పోయింది.
ఆ సినిమా అడ్రస్సే గల్లంతైపోయింది. ఇక, ఇప్పుడు ప్రబాస్ సినిమాలో ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదైనా అమ్మడికి యూజ్ అవుతుందా.? లేదా.? అసలింతకీ ఈ ప్రచారంలో నిజముందా.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలి.
ప్రబాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ సినిమాలో నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆల్రెడీ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ఇద్దరు ముద్దుగుమ్మలకు ఛాన్సుండగా.. అందులో నిధి అగర్వాల్ పేరు తాజాగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







