నేషనల్ సివిల్ సర్వీస్ డే

- April 21, 2024 , by Maagulf
నేషనల్ సివిల్ సర్వీస్ డే

భారతదేశంలో  పరిపాలనా యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న అధికారుల సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నేషనల్ సివిల్ సర్వీస్ డేను నిర్వహిస్తారు.  సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారు. ప్రభుత్వ విధానాల అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా వీరి బాధ్యత.

ఏప్రిల్ 21, 2006న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొదటిసారిగా నేషనల్ సివిల్ సర్వీస్ డే(national civil services day) జరుపుకున్నారు. 1947లో స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొబేషనర్లను ఉద్దేశించి ఇదే రోజు ప్రసంగించడం విశేషం. ఆ క్రమంలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో వల్లభాయ్ పటేల్ దేశంలోని పౌర సేవకులను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు.

భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ B అనే విభాగాలుగా ఉంటాయి.అయితే నేషనల్ సివిల్ సర్వీస్ డేను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడం సహా వారి విజయాలను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుతున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు  ప్రధాని అవార్డులను ప్రదానం చేస్తారు. 

                           --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com