66వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
- April 22, 2024
న్యూఢిల్లీ: అమెరికా పౌరసత్వాని భారతీయులు భారీ స్థాయిలో పొందుతున్నారు. అమెరికా పౌరులుగా మారిన విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో మెక్సికో ప్రజలు ఉన్నారు. అమెరికా సెన్సస్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం, 2022లో 128,878 మంది మెక్సికన్లు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తరువాత స్థానాల్లో ఫిలిప్పీన్స్, క్యూబా, డోమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనీయులు ఉన్నారు.
సెస్సస్ బ్యూరో ప్రకారం, 2022లో అమెరికాలో ఉంటున్న మొత్తం విదేశీయుల సంఖ్య 46 మిలియన్లు. దేశ జనాభాలో వీరి సంఖ్య 14 శాతం. అమెరికాలోని విదేశీయుల్లో దాదాపు 53 శాతం మంది తమకు అమెరికా పౌరసత్వం ఉన్నట్టు తెలిపారు. ఇక 2022లో మొత్తం 969,380 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.
ఇక, 2023 లెక్కల ప్రకారం, విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 28,31,330. అమెరికా పౌరసత్వం ఉన్న విదేశీయుల్లో మెక్సికన్లు (1,06,38,429 మంది) తొలిస్థానంలో నిలవగా భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అయితే, విదేశాల్లో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారిలో 42 శాతం మందికి అమెరికా పౌరులయ్యే అర్హత లేదని ఈ నివేదికలో తేలింది. ఇక గ్రీన్ కార్డు ఉన్న 2,90,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందే అర్హత ఉందని ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







