హనుమాన్ జయంతి

- April 23, 2024 , by Maagulf
హనుమాన్ జయంతి

మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. రామ భక్తుడైన హనుమంతుడిని సంకత్మోచన అంటారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని రకాల కష్టాలు, అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. 

ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటారు. పౌరాణిక, మతపరమైన విశ్వాసాల ప్రకారం.. సంకత్మోచన్ హనుమంతుడు ఈ రోజున జన్మించాడు కావునా.. దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని 23 ఏప్రిల్ 2024న జరుపుకుంటారు.

హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముని సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములు దర్శనం ఇచ్చారు.

హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు, కాబట్టి హనుమాన్ జన్మోత్సవం రోజున బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూజ సమయంలో హనుమంతునికి సింధూరం .. చోళాన్ని సమర్పించాలి. మల్లెపూల నూనెను నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడని నమ్ముతారు.హారతి తర్వాత హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్ హారతి చదవాలి. ఉపవాసం ఉండటం ద్వారా, ఎవరైనా హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతారు.

హనుమంతుడిని మహాదేవుని 11వ అవతారంగా కూడా పరిగణిస్తారు. హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడం వల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలు, భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు.

                                        --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com