హైదారాబాదీ ఖీమా
- July 01, 2015
కావలిసినవి
కీమా - పావుకిలో
టొమాటోలు - రెండు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
బంగాళాదుంపలు - మూడు
కొత్తిమీర - ఒక కట్ట
గరం మసాలా - ఒక చెంచా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
దనియాల పొడి - ఒక చెంచా
జీడిపప్పు పొడి - ఒక చెంచా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కారం - రెండు చెంచాలు
తయారీ
ఒక బాణలిలో నూనె వేసి, దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, దానిలో దనియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఇప్పుడు కీమా వేసి ఒక పావుగంట సేపు మూత పెట్టి ఉడికించాలి. తరువాత దానిలో కొద్దిగా గరంమసాలా, జీడిపప్పు పొడి వేసి, ఉప్పు, కారం, వేసి కలపి, టొమాటో ముక్కలు, బంగాళా దుంప ముక్కలు వేసి ఉడికించి, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే హైద్రాబాదీ ఖీమా రెడీ. రంజాన్ స్పెషల్‌గా మీ ఇంటికి వచ్చే అతిథులను హైద్రాబాదీ ఖీమాతో సర్‌ప్రైజ్ చేసెయ్యండి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







