పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్

- April 24, 2024 , by Maagulf
పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్

దుబాయ్ :యూఏఈ 75 సంవత్సరాలలో చూసిన అత్యంత భారీ వర్షపాతం తర్వాత.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.  దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డిఎక్స్‌బి) సాధారణ విమాన షెడ్యూల్‌లను నడుపుతోందని, రోజుకు సుమారు 1,400 విమాన మూమెంట్స్ ఉన్నాయని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిఇఒ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు.  విమానాశ్రయం మరియు చుట్టుపక్కల ఉన్న రోడ్లపై ఉన్న వరదనీటిని పూర్తిగి తొలగించినట్లు తెలిపారు. తుఫాను మరియు దాని అనంతర పరిణామాల కారణంగా మొత్తం 2,155 విమానాలు రద్దు చేయబడ్డాయి.  115 విమానాలను దారి మళ్లించినట్టు గ్రిఫిత్స్ పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com