ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- April 24, 2024
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు అయ్యాయి.ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోదీ రాష్ట్రానికి రానున్నారు.
పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడ బీజేపీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు.అనంతరం వచ్చే నెల 3, 4 తేదీల్లోనూ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు.అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధం అయ్యారు.ఇందులో భాగంగానే మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు