నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- April 27, 2024
మస్కట్: గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో నిజ్వా ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు నర్సులు మృతి చెందారు. ఆసుపత్రి ముందు రన్ ఓవర్ ప్రమాదంలో మరణించారని అల్ దఖిలియా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హాస్పిటల్ తెలిపింది. మృతి చెందిన ముగ్గురు నర్సులలో ఇద్దరు భారతదేశానికి చెందినవారు కాగా, మరోకరు ఈజిప్టుకు చెందినవారు. నర్సులు పని ముగించుకుని ఆసుపత్రి నుంచి తమ నివాసాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. “ఆసుపత్రి ముందు రన్ ఓవర్ ప్రమాదంలో ముగ్గురు నర్సులు (అమని అబ్దుల్ లతీఫ్, షార్జా ఇలియాస్, మజితా రాజేష్) మరణించారు. మరో ఇద్దరు నర్సుల (షిర్లీ జాస్మిన్, మాలు మాథ్యూ) గాయపడ్డారు. వారు త్వరగా కోలుకోవాలని మేము దేవుడిని వేడుకుంటున్నాము. ’’ అని ఆస్పత్రి డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు