నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ

- April 27, 2024 , by Maagulf
నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ

మక్కా: హజ్ 2024 కోసం సోషల్ మీడియాలో అనధికారిక సేవలను ప్రచారం చేస్తున్న మోసపూరిత హజ్ కంపెనీల గురించి హజ్ , ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు హెచ్చరిక జారీ చేసింది. యాత్రికులు చెల్లుబాటు అయ్యే హజ్ వీసా అవసరమని, సౌదీ అధికారులు లేదా గుర్తింపు పొందిన అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పొందవచ్చని గుర్తు చేసారు. 25 కంటే ఎక్కువ స్కామ్ ఆపరేటర్లను అరెస్టు చేయడానికి దారితీసిన హజ్ మరియు ఉమ్రా కోసం ఇరాకీ సుప్రీం అథారిటీతో కలిసి చేసిన ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద హజ్ సర్వీస్ ప్రకటనలను నివేదించాలని, ఖచ్చితమైన సమాచారం కోసం, సందర్శకులు అధికారిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలను సంప్రదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com