‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్

- May 01, 2024 , by Maagulf
‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్

న్యూ ఢిల్లీ: భారత దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే మెట్రో రైలు వచ్చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రోరైలును నిర్మించారు. త్వరలో ‘మేడ్ ఇన్ ఇండియా’ వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ఈ మెట్రో రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.

ఈ వీడియోలో ఫ్యాక్టరీ లోపల వందే మెట్రో రైలును చూడవచ్చు. అమృత్ భారత్ తర్వాత దేశంలో త్వరలో వందే భారత్ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అతి త్వరలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. అనుకున్నట్లుగానే జూలై నెలలో ఈ ట్రయల్ రన్ అమలు చేసేందుకు రైల్వేశాఖ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.

పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో మొదటి కొన్ని కోచ్‌లను నిర్మించింది. మొదట్లో ఇలాంటి 50 రైళ్లను నిర్మిస్తామని, క్రమంగా వాటి సంఖ్యను 400కి పెంచుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. పరిధి పరంగా వందే భారత్ మెట్రో 100 కి.మీ నుంచి 250 కి.మీల మధ్య ప్రయాణించగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతానికి డిఫాల్ట్ కాన్ఫిగరేషన్‌గా 12 కోచ్‌లను కలిగి ఉంది. 16 కోచ్‌ల వరకు విస్తరించే అవకాశం ఉంది. భద్రతను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 నుంచి అనేక సంస్కరణ కార్యక్రమాలు చేపట్టామని రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com