యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- May 04, 2024
యూఏఈ: యూఏఈ రోడ్లపై మరణాల సంఖ్య 2022తో పోలిస్తే గత సంవత్సరం 3% పెరిగాయి. రోడ్డు భద్రతా నిపుణులు ప్రమాదాల పెరుగుదలకు ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) 2023లో రోడ్డు భద్రత గణాంకాలపై ఇటీవల అప్‌లోడ్ చేసిన 'ఓపెన్ డేటా' ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా 352 రోడ్డు మరణాలు జరిగాయి. ఈ సంవత్సరం డేటా 2022లో నమోదైన 343 మరణాల కంటే 3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కానీ 2021లో నమోదైన 381 మరణాల కంటే 8 శాతం తగ్గుదల నమోదు అయినట్లు అని రోడ్ సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ తెలిపారు. 2008 సంవత్సరంలో 1,000 కంటే ఎక్కువ ట్రాఫిక్ మరణాలను నివేదిక తెలిపింది. MOI డేటా ప్రకారం.. 15 శాతం పెద్ద ప్రమాదాలు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల వల్ల జరుగుతున్నాయని ఎడెల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







