యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- May 04, 2024
అమెరికా: ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్నఅమెరికా తాజాగా ఓ యుద్ధ విమానం నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏఐ చక్కగా నిర్వర్తించింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఏఐ నడుపుతున్న ఎఫ్-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం.
ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంతో ఏఐ విమానం పోటీ పడింది. శత్రువిమానాలపై పైచేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతల విన్యాసాల్లో ఏఐ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది. ఏఐ యుద్ధ విమానంలో ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏఐ గురించి మాట్లాడారు.
‘‘ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం భద్రతా పరంగా ఓ పెద్ద రిస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతిక ఉండాల్సిందే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధాల ప్రయోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ సాంకేతికతకు ఉందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
ఈ సాంకేతిక ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్‌ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 1000 మానవరహిత, ఏఐ ఆధారిత యుద్ధవిమానాల ఫ్లీట్ ఏర్పాటే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది. యుద్ధ విమానాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొనే స్టెల్త్ టెక్నాలజీ (శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా చేసే సాంకేతికత) ఏఐకి ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







