డబల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూట్ మొదలు..
- May 04, 2024
హైదరాబాద్: పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ మార్చ్ లో రిలీజవ్వల్సిన ఈ సినిమా షూటింగ్ అవ్వకపోవడంతో వాయిదా పడింది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఒక కొత్త గెటప్ లో కనపడటంతో బాగా వైరల్ అయింది ఆ క్యారెక్టర్.
పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరిగిన ఈ సినిమా తాజాగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టిందని సమాచారం.
ముంబై లో కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు ఈ సినిమా నిర్మాత ఛార్మి ప్రకటించింది. షూటింగ్ సెట్ లో పూరి జగన్నాధ్, ఛార్మి, పలువురు మూవీ యూనిట్ పూజలు చేసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన షెడ్యూల్ గణేశుడి ఆశీర్వాదంతో మొదలయింది అని తెలిపింది. ఈ షెడ్యూల్ లో భారీగా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం రామ్, పూరి జగన్నాధ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మే 15 రామ్ పోతినేని పుట్టిన రోజున డబల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ వస్తుందని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









