‘బాక్’.! తమన్నా పనైపోయిందని ఎవరన్నారు.!
- May 04, 2024
మిల్కీ బ్యూటీ తమన్నా పనైపోయిందనుకున్న ప్రతీసారీ మళ్లీ పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున లేచొస్తూనే వుంది. తాజాగా ‘బాక్’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో చెల్లిలిగా, భార్యగా, తల్లిగా తనదైన నటనతో ఆకట్టుకున్న తమన్నా దెయ్యం పాత్రలోనూ పర్‌ఫామెన్స్ ఇరగదీసింది.
తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ వారం రిలీజైన సినిమాల్లో ఒకటి. రెగ్యులర్ ఫార్మేట్‌కి భిన్నంగా హారర్ కథాంశంతో రూపొందడం, ఓ వైపు హాలీడే సీజన్ కావడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా ఎట్రాక్ట్ అయ్యారు.
హారర్ సినిమాలకున్న కిక్.. ఈ సినిమాకి బాగా వర్కవుట్ అయ్యింది. టాక్ బాగుండడంతో ఆడియన్స్ ధియేటర్లకు బాగానే వచ్చే అవకాశాలున్నాయ్. అలాగే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, కోవై సరళ వంటి కమెడియన్లు పీక్స్‌లో వినోదం పండించడంతో ఓ వైపు హారర్ ఫీల్, మరోవైపు కడుపుబ్బా నవ్వించే ఎంటర్‌టైన్‌మెంట్ వెరసి ‘బాక్’ సమ్మర్ వసూళ్లు బాగానే రాబట్టొచ్చు.
అన్నట్లు రాశీఖన్నా కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించింది. అయితే తమన్నా ముందు తేలిపోయింది. త్వరలోనే తమన్నా మరో డిఫరెంట్ మూవీ ‘ఓదెల 2’తోనూ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







