రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ప్రారంభం

- May 07, 2024 , by Maagulf
రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ప్రారంభం

రియాద్: యూరోపియన్ యూనియన్ (EU) మరియు సౌదీ అరేబియా మధ్య వాణిజ్య సహకారం పెంపొందించడంలో భాగంగా మే 8న గల్ఫ్ ప్రాంతంలో మొదటి యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవం రియాద్ లో ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ దీనిని చారిత్రకమైనదిగా తెలిపింది. ఈ ఈవెంట్ ఆర్థిక సంబంధాలను పెంపొందించడంలో కీలకమైనదిగా పేర్కొంది. సౌదీ అరేబియాలోని యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ECCKSA) GCC దేశాలలో ఈయూ మద్దతుతో యూరోపియన్ వ్యాపారం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది యూరోపియన్ మరియు సౌదీ సంస్థలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది. గత అక్టోబర్‌లో సౌదీ-యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో జరిగిన ఒప్పందాలను అనుసరించి ఛాంబర్ ను ఏర్పాటు చేసారు.  సౌదీ అరేబియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య వృద్ధి 2022 నాటికి సుమారు $80 బిలియన్లకు చేరిందని సౌదీ పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ వెల్లడించారు. సౌదీ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో సుమారు 1,300 యూరోపియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు.  యూరోపియన్ యూనియన్ - సౌదీ అరేబియా మధ్య మొత్తం వాణిజ్యం 2022లో 75 బిలియన్ యూరోలకు చేరుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 2021లో 55 బిలియన్ యూరోలకు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com