యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- May 07, 2024
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. యూఏఈ, జోర్డాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్, జోర్డాన్ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్‌ఈ డాక్టర్ ఐమాన్ అల్ సఫాది, రిపబ్లిక్ ఆఫ్ టర్కీయే విదేశీ వ్యవహారాలు మంత్రి HE హకన్ ఫిదాన్ లతో కీలక విషయాలను చర్చించారు. ఖతార్ తో సంబంధాలు, గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలు, తక్షణ మరియు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేరుకోవడానికి మార్గాల గురించి చర్చించారు. ఖైదీలు, స్ట్రిప్‌లోని అన్ని ప్రాంతాలకు మానవతా సహాయాన్ని నిలకడగా అందజేయడంపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు ఉద్దేశించిన అన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతివ్వడానికి ఖతార్ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!