కశ్మీర్‌లో 'శ్రీరస్తు శుభమస్తు' షూటింగ్

- June 08, 2016 , by Maagulf
కశ్మీర్‌లో  'శ్రీరస్తు శుభమస్తు'  షూటింగ్

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ చిత్రం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం కశ్మీర్‌ వెళ్తున్నట్లు హీరో అల్లు శిరీష్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. 'శ్రీరస్తు శుభమస్తు చివరి షెడ్యూల్‌ కోసం రేపు కశ్మీర్‌ వెళ్తున్నాం, ఇంత వరకూ ఉత్తర భారతదేశంలోని దిల్లీ, చండీఘర్‌ తప్ప మరే ప్రదేశాన్ని చూడలేదు. ఎగ్జైటింగ్‌గా ఉంది అని ట్వీట్‌ చేశారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. థమన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, తనికెళ్ల భరణి, సుమలత, రవి ప్రకాశ్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com