‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- May 10, 2024
అమరావతి: జగన్ కోసం సిద్దంఏడు రోజుల్లోనే,79 లక్షల మంది సామాన్యులు వైఎస్సార్‌సీపీస్టార్ క్యాంపెయినర్లుగా సీఎం జగన్ కి మద్దతు తెలిపారు. వీరంతా కేవలం జగన్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు, నవరత్నాలు ప్లస్ మానిఫెస్టోలోని హామీలను ప్రతి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, అంతే కాకుండా జగన్ విశ్వసనీయత కలిగిన నాయకుడని చాటి చెబుతున్నారు . అన్నిటికంటే పెద్ద మొత్తంలో మహిళలే స్టార్ క్యాంపెయినర్లుగా పాల్గొంటున్నారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కాకినాడలో, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో అత్యధికంగా స్టార్ క్యాంపెయినర్లు తమ విశ్వాసాన్ని జగన్ కోసం తెలుపుతూ జగన్ కోసం సిద్ధం ప్రచారంలో ముందు నిలిచారు. ఇందులో ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల నుండి విశేష స్పందన లభించడం గమనార్హం.
ఈ స్టార్ క్యాంపెయినర్లు ఇంటింటికి తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాలతో తమకు అందుతున్న ప్రయోజనాలు, సుపరిపాలన తెలుపుతూ, 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు ఒకవైపు ఉంటె సీఎం జగన్ లాంటి నాయకుడి మరో వైపు ఉండి తమ సమస్యలను తీరుస్తున్నారని చెబుతున్నారు. ఈ రోజు కూడా, తమ 2024 మేనిఫెస్టోకి నమ్మకం కలిగించే ఒక్క ఆధారం కానీ దాని వెనకాల ఉన్న తర్కం పైన వారికీ అవగాహన లేదు. మేనిఫెస్టో వాగ్దానాలు, ముస్లిం రిజర్వేషన్లు, రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో చిత్త శుద్ధి లేదని స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేయటం మరో విశేషం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!