బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- May 11, 2024
ముంబై: అక్షయ తృతీయ సీజన్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ అందింది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం లేదా ఏదైనా పండగ ఉన్నా మహిళలు కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత కొద్ది రోజుల నుంచి బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతుండటంతో కొనుగోలు దారులు అయోమయంలో పడిపోయారు. మూడు నెలలపాటు పెండ్లి ముహూర్తాలు లేనప్పటికీ బంగారం రేటు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి. అయితే అంతా మే 10న అక్షయ తృతీయ నాడు బంగారం రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ రేట్లు మరింత పెరగడంతో కొనడం మానేశారు. ఈ క్రమంలో.. మే 10న బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే పసిడి రేట్లు తగ్గి కొనుగోలు దారులకు శుభవార్తను అందించాయి. అయితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గడంతో రూ. 67, 250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.330 తగ్గగా.. 73, 360కి విక్రయిస్తున్నారు. కిలో వెండిపై రూ. 1300 తగ్గడంతో రూ. 90, 500గా ఉంది. దీంతో.. పెళ్లిళ్లు పెట్టుకున్నవారు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







