అనుపమ డైరీ ఇప్పట్లో ఖాళీ లేనట్లే.!
- May 11, 2024
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. లేటెస్ట్గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హాట్ అప్పీల్లో దర్శనమిచ్చి కుర్రకారుకు కొత్త కిక్కిచ్చింది.
ఇక, ఇప్పుడు వరుసగా నాలుగైదు ప్రాజెక్టులు లైన్లో పెట్టేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి అందులో. అలాగే, ‘పెట్ డిటెక్టివ్’ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలోనూ నటిస్తోంది అనుపమ.
దీంతో పాటు తమిళంలోనూ ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. వీటితో పాటూ మరిన్ని ప్రాజెక్టులు అనుపమ కోసం చర్చల దశలో వున్నట్లు తెలుస్తోంది.
టిల్లు స్క్వేర్ దెబ్బతో యాక్షన్ గాళ్ అవతారంలోనూ అనుపమ తళుక్కున మెరిసింది. ఇక, హాట్నెస్లోనూ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకుంది. సో, ఈ మేకోవర్స్ అనుపమ కెరీర్ కొన్నాళ్ల పాటు బిజీ బిజీగా వుంచడంలో బాగా హెల్ప్ అవుతాయని అనడం అతిశయోక్తి కాదేమో.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







