హీరో సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ‘కృష్ణమ్మ’
- May 11, 2024
హైదరాబాద్: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేశాయి. సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మనన్నలు అందుకుంటోంది. సినిమాలో సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి.
సత్యదేవ్ సినీ కెరీర్లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’కు మంచి కలెక్షన్స్ రాబట్టుకోవటం మంచి పరిణామం. సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.
‘కృష్ణమ్మ’ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మంచి మౌత్ వచ్చింది. దీంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మే నెలాఖరు వరకు పెద్దగా రిలీజెస్ లేనందు వల్ల కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తుందనటంలో సందేహం లేదు. ప్రేక్షకులను చక్కటి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటూ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ.
‘కృష్ణమ్మ’ సినిమాలో స్నేహం, ప్రేమ వంటి అంశాలతో మిళితమైన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. సత్యదేవ్ తో పాటు లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అతీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!







