బాలీవుడ్ పై ఎన్టీయార్ ఫోకస్ నిజమేనా..?
- May 13, 2024
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీయార్ గ్లోబల్ స్టార్ స్టేటస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేటస్‌తోనే బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు.
హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీయార్ మెయిన్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. చాలా పవర్ ఫుల్ పాత్రనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసమే ముంబయ్‌లో పాగా వేశాడు ఎన్టీయార్.
అలాగే, ఈ సినిమాతో పాటూ, మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌నీ ఎన్టీయార్ లైన్‌లో పెట్టేశాడట. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో రూపొందబోయే ఈ సినిమా స్పై బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతోందనీ తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయ్. అలాగే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ఎన్టీయార్ కోసం చర్చల దశలో వున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ, ఇదే నిజమైతే, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఎన్టీయార్ బిజీ అయిపోనున్నట్లు తెలుస్తోంది.
ఇక, తెలుగులో రూపొందబోయే ‘దేవర’ సినిమా ఎలాగూ ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!