త్రిష లైనప్ సూపర్బ్.!
- May 13, 2024
అందాల భామ త్రిష ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా దున్నేస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే, తమిళ, మలయాళ సినిమాలతోనూ త్రిష చాలా చాలా బిజీగా వుంది.
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్‌తో త్రిష్ ఓ సినిమాలో నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందనీ సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ వుండబోతోందట.
అలాగే మలయాళంలోనే టువినో థామస్ హీరోగా ‘ఐడెంటిటీ’ అనే సినిమాలోనూ త్రిష నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులు హిందీతో పాటూ.. త్రిష లైన్‌లో పెట్టేసింది.
మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిషకు సెకండ్ ఇన్నింగ్స్‌లో అవకాశాలు మామూలుగా లేవు. చూస్తుంటే.. త్రిష కెరీర్ ఇప్పట్లో ముగిసే అవకాశమే లేదనిపిస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!