సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- May 15, 2024
సింగపూర్: సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. రెండు దశాబ్దాల పాటు ప్రధానిపదవి నిర్వహించి రాజీనామా చేసిన లీ సీన్ లూంగ్ స్థానంలో లారెన్స్ వాంగ్ బాధ్యతలు స్వీకరించారు. పూర్వపు ఉప ప్రధాని అయిన వాంగ్ బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) రాత్రి 8 గంటల తరువాత ఇస్తానా ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానిగా ప్రమాణం చేశారు.
సుసంపన్న దేశమైన సింగపూర్‌కు సారథ్యం వహిస్తున్న లీ కుటుంబేతర రెండవ నేత వాంగ్. ‘చట్ట ప్రకారం, నా సామర్థం మేరకు ప్రధానిగా నా బాధ్యతలను సర్వకాల సర్వావస్థలందు నమ్మకంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా’ అని వాంగ్ తెలిపారు. వాంగ్ మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ మంత్రి సహాయకునిగా నియుక్తుడైన మాజీ ప్రధాని లీ కూడా వారిలో ఉన్నారు. వాంగ్ యుఎస్‌లో చదువుకున్న ఆర్థికవేత్త.
--జానకి జ్యోతి(మాగల్ఫ్ ప్రతినిధి,సింగపూర్)
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









