ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- May 17, 2024
యూఏఈ: ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అధాకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. నివాసితులు Dh980 నుండి ఇటలీకి, Dh1,135 నుండి ఫ్రాన్స్, స్పెయిన్ Dh1,308 నుండి టూర్ ఫ్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ స్కైస్కానర్ తెలిపింది. మార్కెట్ నిపుణుడి ప్రకారం, విరామం సమయంలో ప్రయాణానికి సంబంధించిన విచారణలు 20 శాతం వరకు పెరిగాయి. యూరప్, అమెరికా మరియు ఇతర సుదూర విమాన గమ్యస్థానాలకు వెళ్లడానికి ముందస్తు ప్రణాళికతో వేసవి సెలవుల ప్రారంభంతో కుటుంబాలు పబ్లిక్ హాలిడేని కలుపుకుని సుదీర్ఘ విరామం కోసం చూస్తున్నాయని ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ముసాఫిర్‌లో COO రహీష్ బాబు చెప్పారు. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, సెలవుదినం జూన్ 16( ఆదివారం) నుండి జూన్ 19 (బుధవారం)వరకు ఉంటుంది. ఈ తేదీలు చంద్రుని వీక్షణకు లోబడి ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







