ధియేటర్ల బంద్.! ఈ సమస్యకు పరిష్కారమేంటీ.!
- May 17, 2024
15 రోజుల పాటు ధియేటర్లు బంద్. ఇంకేముంది.! ధియేటర్ల యజమానుల గగ్గోలు. మా గోడు ఎవరికీ పట్టదా.? అని గోల చేస్తున్నారు. కానీ ఏం చేస్తారు.? ధియేటర్లకు జనాన్ని రప్పించలేకపోతున్నారు.
సినిమా అంటే కేవలం ఒక్క రోజు మాత్రమే అన్న చందంగా మారింది. కొన్ని నెలలు.. కొన్ని సినిమాలైతే సంవత్సరాల తరబడి చిత్రీకరిస్తున్నారు. కానీ, ఒక్క రోజు, ఒకే ఒక్క రోజు దాని భవితవ్యం తేల్చేస్తున్నారు.
హిట్ సినిమా అయితే ఓపెనింగ్ డేతో కలిపి మూడు రోజులు.. ఫట్ అయితే సింగిల్ షోకి పరిమితమైపోతుంది. ఈ మధ్య సినిమాలన్నీ వరుసగా వాయిదాలు పడిన సంగతి తెలిసిందే.
ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సింగిల్ స్క్రీన్ ధియేటర్ల యజమానులు ధియేటర్లను బంద్ చేశారు. దాంతో, సినిమాపైనే ఆధారపడి బతికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయాయ్. మరో పక్క సినిమాల షూటింగులూ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయ్.
మరి, ఈ సినిమా సమస్యకు పరిష్కారం లేదా.? అంటే ఓటీటీ, యూ ట్యూబ్, ఇన్‌స్టా.. ఇలా సోషల్ మీడియా వచ్చాకా సినిమాని జనం లెక్క చేయడం మానేశారు. సినిమా నటీనటుల్ని మించి ఇన్‌ఫ్లూయన్సర్లకు వేల్యూ దక్కుతోంది. దాంతో వారి డిమాండ్ చాలా ఎక్కువైపోయింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







