‘హనుమాన్’ హీరో పూరీ జగన్నాధ్‌తోనా.?
- May 17, 2024
అవునండీ.! ఒకప్పుడు పూరీ జగన్నాధ్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎగబడేవారు. అదేంటో, ఆయనతో సినిమా చేస్తే.. ఆ హీరో ఆటిట్యూడ్ గట్రా మారిపోయేవి. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యేదన్న ప్రచారం వుండేది. కానీ, అదంతా ఒకప్పుడు.! ఇప్పుడు పూరీతో సినిమా అంటే ఆ హీరో పరిస్థితి మట్టే.!
అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండని చూపిస్తున్నారు.. అలా తయారైందిప్పుడు పూరీ పరిస్థితి. కానీ, ఇప్పటికీ ఆయనతో సినిమాలు చేయాలనుకుంటున్న హీరోలు లేకపోలేదు.
ఆ లిస్టులో తాజాగా తేజ సజ్జా చేరాడు. ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జా స్థాయి ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ పరిస్థితుల్లో తేజ సజ్జా - పూరీ కాంబినేషన్ అనే ప్రచారం తెరపైకి వచ్చింది.
తేజ సజ్జా రిస్క్ చేస్తున్నాడేమో.! కాస్త ఆచి తూచి ఆలోచిస్తే బావుంటుంది.. అని కొందరు సలహాలిస్తున్నారట. అయితే, పూరీ దగ్గరున్న కథ తేజ సజ్జాకి బాగా నచ్చేసిందట. ఓకే కూడా చేసేశాడని తెలుస్తోంది. అంత మంచి కథ వుంటే, తన కొడుకు ఆకాష్ పూరీకే మంచి కమ్ బ్యాక్ ఇవ్వొచ్చుగా.! అని ఇంకొందరు ఉచితంగా సూచనలిస్తున్నారు మరి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!