సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- May 19, 2024
రియాద్: శనివారం నుండి బుధవారం వరకు కింగ్‌డమ్‌లోని చాలా ప్రాంతాలను ప్రభావితం చేసే ఉరుములతో కూడిన తుఫానుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని పౌర రక్షణ శాఖ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరిక నోటీసును జారీ చేసింది. మక్కా ప్రాంతంలో ఆకస్మిక వరదలు, వడగళ్ళు, దుమ్ము మరియు ఇసుక తుఫానులకు అవకావం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తైఫ్, మేసాన్, అధమ్, అల్-అర్దియత్, అల్-కమిల్ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పవిత్ర రాజధాని మరియు సమీప ప్రాంతాలైన జుముమ్, బహ్రా, రానియా, ఖుర్మా మరియు మోయాల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రియాద్ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం కురుస్తుందని, ఇది ఆకస్మిక వరదలు మరియు వడగళ్ళకు దారి తీయవచ్చని హెచ్చరించారు. అఫీఫ్, దవాద్మీ, ఖువీయా, మజ్మా, అల్-ఘాట్, షక్రా, అజ్ జుల్ఫీ, తాడిక్, మురాత్ మరియు వాడి అల్-దవాసిర్ లు ప్రభావితం అవుతాయన్నారు. వీటితోపాటు జజాన్, అసిర్ మరియు అల్ బహా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, జజాన్, మదీనా, హైల్ మరియు ఖాసిమ్ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆకస్మిక వరదలు, నీటితో నిండిన ప్రదేశాలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, భద్రతా సూచనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..