సూపర్ హీరోకి ధీటుగా మంచు హీరో విలనిజం.!

- May 19, 2024 , by Maagulf
సూపర్ హీరోకి ధీటుగా మంచు హీరో విలనిజం.!

‘హనుమాన్’ సినిమాతో సూపర్ హీరో ట్యాగ్ లైన్ అంది పుచ్చుకున్నాడు తేజ సజ్జా. అనూహ్యమైన విజయం అందుకుంది ఈ సినిమా. దాంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా తేజ సజ్జా పేరు మార్మోగిపోతోందిప్పుడు.
ఇక, ఈ హీరో నుంచి రాబోతున్న తదుపరి సినిమా ‘మిరాయ్’. ఇందులో సూపర్ యోధుడిగా తేజ సజ్జా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై కొన్ని అంచనాలు నమోదు చేసింది.
‘హనుమాన్’‌తో వచ్చిన క్రేజ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లేలానే వుందీ సినిమా. ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాలో విలన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు.
విలన్ రోల్ పోషిస్తున్నది ఎవరో కాదు మంచు హీరో మనోజ్. మనోజ్ చేసిన సినిమాలు తక్కువే అయినా అతని టాలెంట్ గురించి పర్‌ఫామెన్స్ స్టామినా గురించి అందరికీ తెలిసిందే.
అయినా ఆయన ఈ మధ్య సినిమాలకు దూరంగా వుంటున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ‘మిరాయ్’తో వస్తున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బ్లాక్ స్వార్డ్ సింబాలిక్‌గా మంచు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఏ స్థాయిలో వుండబోతోందో చెప్పకనే చెప్పింది.
ఈ నెల 20 న మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి, మనోజ్ కమ్ బ్యాక్ ఎలా వుండబోతోందో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com