పూరీ జగన్నాధ్ ప్రూవ్ చేసుకున్నాడా.? లేదా.?

- May 19, 2024 , by Maagulf
పూరీ జగన్నాధ్ ప్రూవ్ చేసుకున్నాడా.? లేదా.?

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో టేక్ లైట్ అనుకున్నా, ఈ టీజర్‌కి మంచి వ్యూస్ రావడంతో ఒకింత అంచనాలు పెరిగాయ్.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలి పూరీ జగన్నాధ్. అప్పుడే తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకోగలడు. అందుకే ఈ సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టాడట పూరీ. కొందరు సో సో గా వుందంతే అని అంటుంటే, ఇంకొందరు ఏది ఏమైనా పూరీ అంటే పూరీనే ఏదో మ్యాజిక్ వుంటుంది ఆయన సినిమాలో.. అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకొచ్చి ప్రతినాయకుడి పాత్ర మెయిన్ అస్సెట్ కానుందని చెప్పొచ్చేమో. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు టీజర్‌లో ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో వున్నాయ్.
విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా వుంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. సంజయ్ దత్ లాంటి విలన్‌ని డబుల్ ధిమాక్ వున్న శంకర్ పాత్ర ఎలా తట్టుకోగలదు.? ఆ సిట్యువేషన్‌ని డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ ఎలా డీల్ చేశాడు.? అనేదే ‘డబుల్ ఇస్మార్ట్’ కథ. చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com