ప్రపంచవ్యాప్తంగా జూన్ 7 న విడుదలకు రంగం సిద్ధం అయిన 'స్పీడ్220' చిత్రం
- May 24, 2024
హైదరాబాద్: విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రం స్పీడ్220. హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించిన ఈ చిత్రంలో హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు. వీరి సరసన ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ పనులు ముగించుకొని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కమిటెడ్ గా ఉన్నారు. స్పీడ్220 చిత్రం నుంచి ప్రతీ ప్రొమోషనల్ వీడియో, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఊపేసింది. బెజవాడలో బాలా కుమారి అనే స్పెషల్ సాంగ్ ప్రముఖ సింగర్ గీతామాధురి ఆలపించగా స్నేహ గుప్తా డ్యాన్స్ కుమ్మెసింది. ప్రస్తుతం మంచి వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ తరుణంలో మరో సాంగ్ సైతం విడుదల చేశారు మేకర్స్. మొదటిది నరాలు జివ్వుమనే ఐటమ్ బాంబ్ అయితే సెకండ్ ది గుండెను పిండేసి ఎమోషనల్ మెలోడి సాంద్. హే పిల్లా అంటూ సాగే ఈ పాట భావోద్వేగాలతో నిండి హృదయాన్ని బరువెక్కించేలా చేస్తుంది. సురేష్ గంగుల లిరిక్స్ అందించగా, శ్రీదీప్ ప్రాణం పెట్టి ఆలపించారు. శేఖర్ మోపూరి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట యూట్యూలో దూసుకుపోతుంది.
ఇప్పటికే సెన్సార్ సభ్యులు స్పీడ్ 220 చిత్రానకి రివ్యూ ఇచ్చారు. అన్ని భావోద్వేగాలు సమపాలల్లో ఉన్నాయని, మంచి సినిమా అవుతుందని పేర్కొన్నారు. సినిమా కచ్చితంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ సైతం నమ్మకంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింప చేసేలా ఈ చిత్రం ఉంటుందని, నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు. యూత్ కు కనెక్ట్ అయ్యే టైటిల్ స్పీడ్220 సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది. పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ కథ ఎంటో తెలియాలంటే జూన్ 7 వరకు వేచి చూడాల్సిందే.
చిత్రం: స్పీడ్220
నిర్మాత: ఫణి కొండమూరి, మందపల్లి బ్రదర్స్ & దుర్గ
హీరోలు: హేమంత్, గణేష్
హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ
డ్యాన్సర్: స్నేహ గుప్తా
కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి
సింగర్ : గీతమాధురి
డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన
పీఆర్ఓ : హరీష్, దినేష్
కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







