IPL 2024: కోల్‌కతాదే ఐపీఎల్ కప్..
- May 26, 2024
చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్ ఛాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీమ్ హైదరాబాద్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను ఎగరేసుకుపోయింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ తొందరగా ఔటైనా వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో విజృంభించాడు. మరో ఓపెనర్ గుర్బాజ్ (39) కూడా రాణించాడు. శ్రేయస్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటయ్యింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







