తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల షెడ్యూల్ విడుదల

- May 27, 2024 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు.

జూన్‌ 2న ఉదయం గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు.

”జూన్‌ 2న ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్‌ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలూ ఏర్పాటు అవుతాయి.

రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్‌ జరుగుతుంది. అందులో బాణసంచా, లేజర్‌ షో ఉంటాయి. 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్‌ ప్రదర్శన చేస్తారు”అని సీఎస్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com