ప్రేమం లో ముఖ్య పాత్ర పోషించనున్న వెంకీ
- June 10, 2016
టాలీవుడ్ హీరోల్లో అత్యంత సక్సెస్ ఫుల్ కెరీర్ గ్రాఫ్ ఎవరిది అంటే విక్టరీ వెంకటేష్ పేరే చెప్పాలి. సినిమాలో కథ తప్ప మిగిలినవన్నీ సెకండరీయే అని ఆయన భావిస్తారు. అందుకే ఆయన ట్రాక్ రికార్డ్ ఆ రేంజ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకూ అతిథి పాత్రలో చేయని వెంకీ, ప్రేమమ్ లో ఒక ముఖ్య పాత్రలో కాసేపు కనిపిస్తారని వార్తలు వచ్చాయి.ఇప్పటి వరకూ ఎవరూ ఖరారు చేయనప్పటికీ, మేనల్లుడి కోసం వెంకీ ఒప్పుకోక తప్పలేదని సమాచారం.మళయాళ ప్రేమమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ప్రేమమ్ లో హీరో పాత్రతో మంచి అనుబంధం ఉన్న ఒక కీలక పాత్రను వెంకీ పోషించారట. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయిందని అంటున్నారు సినీజనాలు.అయితే అసలు విషయాన్ని మూవీ టీం ప్రకటిస్తే తప్ప తెలీదు.ఒక వేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం, అక్కినేని దగ్గుబాటి ఫ్యాన్స్ కు పండగే. వెంకీ విషయానికొస్తే, తన బాబు బంగారం సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన మూవీ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







