ఛోటా రాజన్ ను హత్య చేసేందుకు దావూద్ ఇబ్రహీం అనుచరుడు ..
- June 10, 2016
తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్ ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్ ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు పథకం పన్నినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.ఛోటా షకీల్ తో నిందితులు ఫోన్ సంభాషణలు సాగించినట్టు గుర్తించామని, అనంతరం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు స్పెషల్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) అరవింద్ దీప్ చెప్పారు. జూన్ 3వ తేదీన వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 5 రోజులు పోలీసుల రిమాండ్ కు అప్పగించారు.
విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీకి అదేశించినట్టు అరవింద్ దీప్ చెప్పారు. ఓ నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్ లో ఇండోనేసియాలో అరెస్ట్ అయిన ఛోటా రాజన్ ను భారత్ కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







