ఒమన్ సముద్రంలో రెండు భూకంపాలు
- May 29, 2024
యూఏఈః నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రకారం.. బుధవారం ఒమన్ సముద్రంలో స్వల్ప భూకంపాలు సంభవించాయి. యూఏఈ నివాసితులు 'స్వల్ప' ప్రకంపనలు అనుభవించినట్టు తెలుస్తోంది. రస్ అల్ ఖైమా తీరానికి సమీపంలో అర్ధరాత్రి 12.12 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం, 1.53 గంటలకు 2.8 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. రెండు భూకంపాలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. అయితే, యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని నిపుణులు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో మే 17న యూఏఈలో 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు, ఏప్రిల్‌లో ఖోర్ ఫక్కన్‌లో నివాసితులు ప్రకంపనలు అనుభవించారు. జనవరిలో ఫుజైరా మరియు రస్ అల్ ఖైమా సరిహద్దులోని మసాఫీలో కూడా 2.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!







