67 మిలియన్ దిర్హామ్‌ల ఆసుపత్రి బిల్లుల చెల్లింపు
- June 10, 2016
1,640 మంది పేద రోగుల కోసం గత ఏడాది 67 మిలియన్ దిర్హామ్‌ల మొత్తాన్ని ఆసుపత్రులకు చెల్లించినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారి చెప్పారు. ఆసుపత్రి బిల్లుల్ని చెల్లించలేక, ఖరీదైన వైద్యంతో ఆర్థికంగా చితికిపోయేవారికి ఇది ఎంతో ఊరట కల్గిస్తుందని వారు వివరించారు. దుబాయ్ హెల్త్ అథారిటీకి చెందిన ముసాదా కమిటీ చేపట్టిన ఫండ్ రైజింగ్‌తో ఈ మొత్తం సొమ్మును సేకరించగలిగామని కమిటీ హెడ్ సలీమ్ మొహమ్మద్ బిన్ లహెజ్ చెప్పారు. సర్జరీలు, డయాలసిస్, కిమోథెరపీ వంటి వాటి కోసం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వ్తుందని, ఇది రోగులకు ఆర్థిక భారం అవుతుంది గనుక డిహెచ్‌ఎ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లోని రోగులకోసం ఈ ఛారిటీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. అరబిక్‌లో ముసాదా అంటే సహాయం. ఓ రేడియో ప్రోగ్రామ్ ద్వారా సంపాదించిన 4 మిలియన్ దిర్హామ్‌లతో 85 మంది రోగులకు సహాయం అందించగలిగారు. మరో రెండు కార్యక్రమాల్ని ముసాదా కమిటీ నిర్వహించబోతోందని, 30,000 భోజనాల్ని ఇఫ్తార్ కానుకగా డిహెచ్‌ఎ ఆసుపత్రుల్లో అందింంచనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







