ఒమన్‌కి ఎయిర్ ట్యాక్సీ ప్రారంభించిన యూఏఈ సీ వింగ్స్
- June 10, 2016
యూఏఈకి చెందిన సీ ప్లేన్ ఆపరేటర్ 'సీ వింగ్స్' యూఏఈ నుంచి ఒమన్ మరియు ఖతార్‌లకు ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించింది. యూఏఈ సెంట్రల్ బిజినెస్ మరియు లీజర్ డెస్టినేషన్స్ నుంచి ఒమన్ మరియు ఖతార్ ఎయిర్‌పోర్ట్‌లకు ఈ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు నడుస్తాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, దుబాయ్ వరల్డ్ సెంట్రల్, జబెల్ అలి గోల్ఫ్ రిసార్ట్ అండ్ స్పా, దుబాయ్ క్రూయిజ్ టర్మినల్, అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అల్ బతీన్, అల్ రువైస్, అల్ అయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, రస్ అల్ ఖైమాలోని హిల్టన్ బీచ్ హోటల్, రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అల్ హమారా మరియు సిటీ కోర్నిచె, ఫుజారియాలో అల్ అఖా బీచ్, ఫుజైరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఫుజారియా ఇంటర్నేషనల్ మెరైన్ క్లబ్ తదితర డెస్టినేషన్లకు ఎయిర్ ట్యాక్సీ సౌకర్యాలను అందిస్తుంది. నీటిలోంచి టేకాఫ్ తీసుకోవడం, అలాగే నీటిలో ల్యాండ్ అవడం, ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ టేకాఫ్ ఈ సీ ప్లేన్ ప్రత్యేకత అని సీ వింగ్ సీఈఓ స్టువర్ట్ వీలర్ చెప్పారు. ఎయిర్ ట్యాక్సీలలో ప్రయాణం అద్భుత అనుభూతిని అందిస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







