మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు
- June 10, 2016
సౌదీ అరేబియా, 95000 పైగా మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు పలు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనికి సంబంధించి త్వరలో పూర్తి స్పష్టత రానుందని ఇస్లామిక్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ తౌఫీక్ అల్ సుదైరి వివరించారు. ప్రముఖమైన మసీదుల నుంచి మొదలు పెట్టి, ఈ ప్రాజెక్ట్‌ని విజయవంతం చేస్తామని, సెక్యూరిటీ ఏజెన్సీస్‌కీ తమకూ మధ్య పూర్తిస్థాయి సంయమనం ఉందని ఆయన వెల్లడించారు. గత ఏడాది సూసైడ్ బాంబర్స్, మసీదులపై దాడికి దిగి పలువుర్ని హతమార్చారు. పలువురు ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మసీదుల వద్ద పూర్తిస్థాయి భద్రత కోసం సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు చేయాలని భావించామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







