స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ
- May 31, 2024
న్యూఢిల్లీ: ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. కాగా, తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేయనున్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ‘ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







