గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆసనాలు
- June 10, 2016
చిన్నవయసు వారిని కూడా గుండె సమస్యలు బాధిస్తోన్న రోజులివి. బీపీ, గుండెదడ, గుండెల్లో బరువుగా అనిపించడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కొందరికి. అలాంటివారు ఆ సమస్యల్ని తగ్గించుకోవాలంటే ఈ ముద్ర, ఆసనాలు ప్రయత్నించాలి.
రుద్రముద్ర: ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే ముద్ర. సుఖాసనంలో కూర్చుని కళ్లు మూసుకుని రెండు చేతులతో ఉంగరం వేలూ, చూపుడూ వేళ్ల చివర్లు బొటనవేళ్లకు ఆనించాలి. మధ్యవేలూ, చిటికెన వేలూ చాచి ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇలా ఐదు నిమిషాలే చేయాలి. ఈ ముద్రను రోజులో మూడు సార్లు చేయొచ్చు. వూరికే అలసిపోవడం, తలతిరగడం వంటి లక్షణాలు ఉంటే ఈ ముద్ర వేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. నిర్లిప్తత, నిరాశ వంటివీ దూరమవుతాయి.
షుప్తబద్ధకోణాసనం: నేలమీద వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లూ దగ్గరకు తీసుకుని రెండు మోకాళ్లూ నేలకు తగిలేట్టుగా ఉంచాలి. శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ ఆసనం వేయడం వల్ల గుండెకు విశ్రాంతి లభిస్తుంది. గుండెబరువుగా అనిపించడం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇతరత్రా గుండె సమస్యలున్నవారు ఈ ఆసనంతోపాటూ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
వీరభద్రాసనం: నిలబడి... కాళ్లు దూరంగా స్ట్రెచ్ చేసి ఉంచాలి. కుడిమోకాలు 90 డిగ్రీల్లో వంచి ఎడమకాలుని వెనక్కి స్ట్రెచ్ చేసి ఉంచాలి. రెండు చేతులూ కొంచెం పక్కకు ఉంచి తల పైకి ఎత్తి శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో పది నుంచి ఇరవై సెకన్ల వరకూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఇలా ఎడమవైపు కూడా చేయాలి. కుడివైపు రెండు సార్లు ఎడమ వైపు రెండు సార్ల చొప్పున ఈ ఆసనం వేయాలి. గుండెకు సంబంధించిన సమస్యలుంటే తగ్గుతాయి.
వక్రాసనం: రెండు కాళ్లూ ముందుకు చాపి కూర్చోవాలి. ఎడమ మోకాలిని మడిచి ఆ పాదాన్ని కుడిమోకాలి పక్కన పెట్టాలి. ఎడమవైపు రెండు చేతులూ ఆనించి.. శ్వాస వదులుతూ ఎడమవైపు తిరిగి చూడాలి. ఆ స్థితిలో అరనిమిషం ఉండి మెల్లగా శ్వాస తీసుకుంటూ మామూలు స్థితికి రావాలి. అలాగే ఎడమ వైపు మూడు సార్లు చేయాలి. తర్వాత ఇదే విధంగా, కుడివైపు కూడా చేయాలి. గుండె కండరాలు సాగుతాయి. బలంగా తయారవుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







